‘స్వామి’ ట్రైలర్ టాక్

మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడు హరి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సింగం’ సిరీస్ తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. హరి దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సామి స్క్వేర్’. 2003 బ్లాక్‌బస్టర్ ‘సామి’కి సీక్వెల్‌గా వస్తోన్న చిత్రమిది. తెలుగులో ‘సామి’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో విక్రమ్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఆయన సరసన కీర్తి సురేష్ జతకట్టనుంది. తాజాగా, ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
యాక్షన్ ని హైలైట్ చేస్తూ ట్రైలర్ ని కట్ చేశారు. ‘మత్స్యస్వామి, కూర్మస్వామి, వరాహస్వామి, నరసింహస్వామి, రావణ స్వామి, పరశురామస్వామి.. ’ అనే డైలాగ్ బాగా పేలింది. విక్రమ్-కీర్తి సురేష్ ల మధ్య సీన్స్ ఆకట్టుకొంటున్నాయ్. ‘జీవితంలో ఇంకెవర్నీ ప్రేమించకూడదు..’ అని విక్రమ్ తన ప్రేయసి కీర్తి సురేశ్‌తో అంటే.. ‘నేను నలుగుర్ని ప్రేమిస్తాను’ అని ఆమె కోపంతో సమాధానం ఇచ్చారు. చివరల్లో ‘నేను పోలీసు కాదు.. పోకిరి’ అంటూ విక్రమ్ మహేష్ బాబుని గుర్తు చేశారు. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండీ !
