బ్రేకింగ్ : టీడీపీ-సీపీఐ పొత్తు ఖరారు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖరారైన వేళ రాజకీయ పార్టీలు పొత్తులు-ఎత్తులపై ఫోకస్ చేసింది. ఇక, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. తెలంగాణలో మాత్రం ప్రభావాన్ని కోల్పోయింది. ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఐతే, ఇప్పుడు ఎన్నికల వేళ తమ ప్రభావాన్ని చూపేందుకు తెలుగు తమ్ముళ్లు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా కలిసి వచ్చే పార్టీలతో పొత్తులపై చర్చ జరుపుతున్నారు. తాజాగా, టీడీపీ, సీపీఐ పార్టీ నేతలు సమావేశమై ఎన్నికల పొత్తుపై సుదీర్ఘంగా చర్చించారు. ఇరు పార్టీలు పొత్తులకు అంగీకారం తెలిపారు. అంతేకాదు.. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుపబోతున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నుంచి ఎల్ రమణ, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.