త్రివిక్రమ్ అవన్నీ కాపీ కొట్టేశాడు

‘కలం మనదైనప్పుడు కాపీతో పనేముంది’. ఇది త్రివిక్రమ్ కు సరిగ్గా సరిపోద్ది. ఆయన సినిమాల విషయంలో ఎప్పుడు కాపీ మాటలు వినబడలేదు. ఐతే, ‘అజ్ఝాతవాసి’ కాపీ మరక ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేసేసింది. ఇది హాలీవుడ్ చిత్రం “లార్గో వించ్”కు కాపీ అని తేలిపోయిన సంగతి తెలిసిందే. కాపీ కొట్టడం కూడా కరెక్ట్ గా రావాలంటారు. ఇన్నాళ్లు సొంత కలం పవర్ చూపించిన త్రివిక్రమ్’కు సరిగ్గా కాపీ కొట్టడం రాలే. ఫలితంగా ‘అజ్ఝాతవాసి’ అట్టర్ ప్లాపుగా మిగిలిపోయింది. ఇక, త్రివిక్రమ్ పనైపోయిందనే ప్రచారం జరిగింది.

వీటన్నింటికి మాటలతో కాకుండా చేతులతోనే సమాధానం చెప్పాలని త్రివిక్రమ్ చూస్తున్నాడు. ఇందులో భాగంగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ‘అరవింద సమేత వీర రాఘవ’డిగా బరిలోకి దింపుతున్నాడు. దసరా కానుకగా ఈ గురువారమే వీర రాఘవుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఐతే, ఇందులోనూ త్రివిక్రమ్ కాపీ కొట్టినట్టు అర్థమవుతోంది. అది కథ కాదు. కొన్ని రిపీట్ సీన్స్ కనబడుతున్నాయి. అది పరాయి సినిమాలవి కావు. ఆయన సొంత సినిమాల్లోని. మరీ.. అవి ఆయన సెంటిమెంట్ కూడా కావొచ్చు.

‘అరవింద సమేత’ ఫస్ట్ లుక్ వదిలినప్పుడు.. అది ‘అజ్ఝాతవాసి’ ఫస్ట్ లుక్ తో పోల్చుకొని ఎన్టీఆర్ అభిమానులు భయపడిపోయారు. అక్కడ, ఇక్కడ సేమ్ కుర్చీ అనే కామెంట్స్ వినబడ్డాయి. కుర్చీ సెంటిమెంట్ నందమూరి అభిమానులని కలవరపెట్టింది. ఆ తర్వాత ట్రైలర్ కత్తి.. అది పట్టుకొన్న తీరు త్రివిక్రమ్ గత సినిమాలని పోలీవుంది. ఇక, ఈ సినిమా పోస్టర్స్ లో తారక్ బ్యాగ్ వేసుకొని నడుచుకొంటూ వెళ్తున్న పోస్టర్ పై పెద్ద ప్రచారమే జరిగింది. అతడు నుంచి అజ్ఝాతవాసి వరకు త్రివిక్రమ్ ప్రతి సినిమాలోనూ హీరో ఇలాంటి బ్యాగ్ తో కనిపించాడు. దీంతో త్రివిక్రమ్ బ్యాగ్స్ సెంటిమెంట్స్ పై పెద్ద చర్చే జరుగుతోంది.

ఇలా ఒకటి రెండు కాదు.. చాలానే ఉన్నాయి. డ్రెస్సింగ్ విషయంలోనూ అంతే. ప్రత్యేకంగా హీరోయిన్ డ్రెస్సింగ్ విషయంలో.. గత సినిమాల పోలికలు ఉన్నాయని చెబుతున్నారు. ఇవన్నీ ఉన్నా సరే.. త్రివిక్రమ్ మాటల్లో కాపీ ఉండకూడదు. ఆయన అందించే వినోదంలో తేడా ఉండకూడదు. ఫైనల్ గా ఆయన విజయంలో తేడా రాకూడదు. ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. ఈ యేడాది బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని త్రివిక్రమ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ త్రివిక్రమ్ గారు.. !
