కంగనా డోసు పెంచింది.. ఇక ఆపడం కష్టం !!


బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్‌ ఫైర్ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో హృతిక్ రోషన్ ఏపీసోడ్ లో చూశాం. ఇప్పుడామె మరోసారి ఫైర్ అయినట్టు కనబడుతోంది. బాలీవుడ్ లో తనుశ్రీ దత్తా – నానా పటేకర్ ల వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అది కాస్త బాలీవుడ్ లో #మీటూ ఉద్యమానికి దారితీసింది. ఇప్పుడీ ఉద్యమానికి యంగ్, సీనియర్ హీరోయిన్స్ మద్దతు తెలిపుతున్నారు. కంగనా కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపింది. అంతేకాదు.. తనకి ఎదురైన ఇలాంటి చేధు జ్ఝాపకాలని పంచుకొంది.

క్వీన్ దర్శకుడు వికాస్ తనని లైంగిక వేధించాడని ఆరోపణలు చేసింది. ఐతే, కంగనాని నమ్మలేమని హీరోయిన్ సోనమ్ కపూర్ అనడంతో వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో కంగనా డోసు పెంచింది. ఇప్పటి వరకు వికాస్ కౌగిలింతలో వేరే అర్థం ఉందన్న కంగనా.. ఇప్పుడా ఆయన అమ్మాయిల పిచ్చోడని ఆరోపిస్తోంది. 2014లో క్వీన్‌ చిత్ర షూటింగ్‌ సమయంలో దర్శకుడు వికాస్‌ రోజుకో అమ్మాయితో ఎంజాయ్‌ చేసేవాడు. ప్రతి రాత్రి విందు, వినోదాలు జరిగేవి.

షూటింగ్‌ పూర్తి కాగానే నేను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోయేదాన్ని. రోజూ షూటింగ్‌ పూర్తి కాగానే నేను దర్శకుడు వికాశ్‌ కలిసి హగ్‌ చేసుకునే వాళ్లం. ఐతె, అతను నా మెడపై ముఖం పెట్టి గట్టిగా నొక్కేసేవాడు. అతని నుంచి విడిపించుకోవడాని చాలా బాధతో పోరాడాల్సి వచ్చేది. నువ్వు ఎలా గుభాళిస్తుంటావు. నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని అంటుండేవాడని చెప్పుకొచ్చింది. మొత్తంగా.. కంగనా డోసు పెంచింది.. ఇక ఆమెని ఆపలేం అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఇదీ నిజమే… !