లైంగిక వేధింపులు.. సమంత కూడా చేరిపోయింది !

#మీటూ ఉద్యమం దేశం మొత్తం వ్యాపించింది. హాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమాన్ని బాలీవుడ్‌లో తనుశ్రీ దత్తా ప్రారంభించింది. ఇప్పుడీ ఉద్యమం దక్షిణాది సినీ పరిశ్రమకు కూడా వ్యాపించింది. దక్షిణాదిలో గాయని చిన్మయి శ్రీపాద ఈ #మీటూ ఉద్యమాన్ని ప్రారంభించారు. తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు చిన్మయి. సమంతకు చిన్మయి స్నేహితురాలు. దీంతో స్నేహితురాలు ప్రారంభించిన ఉద్యమానికి సామ్ మద్దతు తెలిపింది.
‘చాలా మంది మహిళలు ధైర్యం తెచ్చుకుని తాము ఎదుర్కొన్న సంఘటనల గురించి బయటపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. మీ ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఈ విషయంలో కొందరు వ్యక్తులు, మహిళలు మిమ్మల్ని నిలదీస్తూ, ప్రశ్నిస్తున్నందుకు సారీ. మీరు నోరు తెరిచి మాట్లాడటం వల్ల చెప్పుకోలేని చిన్న పిల్లలను మీరు కాపాడినవారవుతారు. అందుకు ధన్యవాదాలు. ‘metooindiamovement’కు నేను మద్దతు తెలుపుతున్నాను’ అంటూ సామ్ ట్విట్ చేసింది. సామ్ సపోర్టుతో టాలీవుడ్ లోనూ #మీటూ ఉద్యమం ఊపందుకోవడం ఖాయం. ఈ నేపథ్యంలో ఎంతమంది ప్రముఖుల పేర్లు బయటికొస్తాయో.. చూడాలి !
