ప్రివ్యూ : అరవింద సమేత

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 12యేళ్ల కల త్రివిక్రమ్ తో సినిమా చేయాలని. ఇప్పుడా కల ‘అరవింద సమేత’తో నెరవేరింది. ఆ కలల చిత్రాన్ని ప్రేక్షకులు చూసే టైమొచ్చింది. దసరా కానుకగా ‘అరవింద సమేత’ రేపు (గురువారం) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒకరికి ఫ్యాక్షన్-యాక్షన్ కొట్టిన పిండి. దాన్ని ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఆస్వాధించేలా తీయడం మరొకరి ప్రత్యేకత. వీరిద్దరు కలిసి రంగంలోకి దిగితే ఎట్టుట్టదో చూడాలని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దానికి ఇంకొన్ని గంటల సమయం ఉంది. ఈలోపు ఈ సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ.. !

ప్రివ్యూ :

* దర్శకుడు త్రివిక్రమ్ కలం పవర్ తెలిసిందే. ఆయన మాటలు మనతో పాటుగా ఇంటివరకు వస్తాయి. మన జీవితంలో భాగం అయిపోతాయి. ఓ కుర్రాడి నుంచి ఓ ముసలాడు మాట్లాడే మాటల్లోనూ అవి వినిపిస్తుంటాయ్.

* తారక్ యాక్షన్, త్రివిక్రమ్ మాటలు కలిస్తే.. ఎట్టుట్టదో చూడాలి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

* ‘అరవింద సమేత’లోనూ త్రివిక్రమ్ మాటలు హైలైట్ గా నిలవనున్నాయి. దీంతోపాటు యాక్షన్ హైలైట్ కానుంది.

* టీజర్ లోనే త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో పాటు, తారక్ మార్క్ యాక్షన్ ని చూసేశాం. ఇక, ట్రైలర్ లో త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఆయన అనుభవంలోంచి వచ్చిన మాటలు వినిపించాయి.

* తారక్-త్రివిక్రమ్ తొలిసారి కలిశారు. వీరి కలయికపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 100కోట్ల వరకు జరిగింది.

* ఇప్పుడు తారత్ టార్గెట్ రూ. 100కోట్లు

* భారీ అంచనాల నేపథ్యంలో ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డు స్థాయిలో రానున్నాయి. ఇక, దసరా సెలవులు కావడంతో తొలివారం కలెక్షన్ సాన్ బాహుబలి రికార్డులన్నీ తిరగరాస్తాయని ట్రెడ్ వర్గాలు భావిస్తున్నాయి.

* త్రివిక్రమ్ టేకింగ్ హైలైట్ గా ఈ సినిమా వస్తోంది. తారక్ యాక్షన్ అదిరిపోయేలా ఉండనుంది. ఈ సారి పూజా గ్లామర్ తో పాటు నటనతోనూ మెప్పించనుంది. తమన్ అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆ రేంజ్ లోనే ఉండనుందట.

* జగపతి బాబు, నవీన్ చంద్ర నెగటివ్ రోల్స్ లో అదరగొట్టారని చెబుతున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉండనున్నాయట. త్రివిక్రమ్ గత సినిమాల మాదిరిగా ఇందులో మహిళా ప్రేక్షకులు మెచ్చే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయట.

* ఇక, మాస్ ప్రేక్షకులకి విందు భోజనమే. టీజర్ తోనే ఆ విషయం అర్థమయింది. మొత్తంగా.. ‘అరవింద సమేత’ విడుదలకి ముందే హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. మరీ.. ఆ అంచనాలని వీర రాఘవుడు ఏ మేరకు అందుకుంటాడనేది చూడాలి.