మరో ముగ్గురు సిట్టింగ్‌లు ఔట్‌

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకి వెళ్లిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఎలాంటి అసమత్తి తలెత్తకుండా టికెట్లని ఖరారు చేస్తోంది. ముందు నుంచి చెప్పినట్టుగా సిట్టింగులకే పెద్ద పీఠ వేశారు కేసీఆర్. అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే 105మందితో కూడిన తొలిజాబితాని ప్రకటించేశారు. ఇందులో ఇద్దరు తప్ప అందురు సిట్టింగులే. ఇక, మిగిలిన 14స్థానాల్లోనూ అసమ్మతి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇప్పుడీ స్థానాలకు సంబంధించిన జాబితా ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారమ్. మరో ముగ్గురికి సిట్టింగులకి మొండి చేయి చూపించబోతున్నట్టు తెలిసింది. ఇందులో ఈ గల్లంతయ్యే స్థానాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మేడ్చల్‌, మల్కాజ్‌గిరి ఉన్నట్లు తెలుస్తోండి. హుజూర్‌నగర్‌ నుంచి అప్పిరెడ్డి టికెట్ దాదాపు ఖరారైనట్టే. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న శంకరమ్మను మంత్రి కేటీఆర్‌ క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడినట్లు తెలిసింది. స్థానికంగా ఉన్న పరిస్థితులు వివరించి, అక్కడ పోటీకి అవకాశం ఇవ్వకపోవడానికి గల కారణాలు చెప్పినట్లు తెలిసింది. భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తామని భరోసానిచ్చినట్లు సమాచారం.

ఇప్పటికే దాదాపు ఖరారైన స్థానాలు – అభ్యర్థుల వివరాల్ ఇలా ఉన్నాయి :

* మల్కాజగిరి – మైనంపల్లి హన్మంతరావు

* మేడ్చల్‌ – మల్లారెడ్డి

* వరంగల్‌ తూర్పు – నన్నపనేని నరేందర్‌

* ఖైరతాబాద్‌ – దానంనాగేందర్‌

* ముషీరాబాద్‌ – ముఠాగోపాల్‌

* అంబర్‌పేట – ఎడ్ల సుధాకర్‌రెడ్డి

* జహీరాబాద్‌ – ఎర్రోళ్ళ శ్రీనివాస్‌

* చొప్పదండి – సుంకే రవిశంకర్‌

* గోషామహల్‌ – ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌

* కోదాడ – వేనేపల్లిచందర్‌రావు

* హుజూర్‌నగర్‌ – అప్పిరెడ్డి

* వికారాబాద్‌ – రామచందర్‌