సూపర్ స్టార్’కు జన్మదిన శుభాకాంక్షలు

సూపర్ స్టార్, కింగ్ ఆఫ్ స్టయిల్ రజనీకాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి.

పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు రజనీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘నా స్నేహితుడు ర‌జ‌నీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు’ అని బిగ్ బి ట్విట్ చేశాడు. “మీతో ప‌ని చేయ‌డం వ‌ల్ల ఎంతో నేర్చుకున్నాను” సార్ అంటూ అక్షయ్ కుమార్ ట్విట్ చేశాడు. ర‌జనీతో స‌న్నిహితంగా ఉండే మోహ‌న్ బాబు ఈ ఇద్ద‌రు క‌ల‌సి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ, నిండు నూరేళ్లు జీవించాల‌ని ఆశీర్వ‌దించాడు.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తమిళ్ స్టార్స్ క‌మ‌ల్ హాస‌న్, సూర్య‌, విజ‌య్, విజ‌య్ సేతుప‌తి, ధ‌నుష్, కార్తీ, శ‌ర‌త్ కుమార్, ఎస్ జె సూర్య‌, జై, సంతానం, న‌య‌న తార‌, విఘ్నేష్, హ‌న్సిక‌, రాధిక‌, ఖ‌ష్బూ, న‌మిత‌, మురుగ‌దాస్, త‌దిత‌రులు ఈ సూప‌ర్ స్టార్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

రజనీ పుట్టినరోజు సందర్బంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు మీ కోసం :
* ప్రతి హోలీ పండుగకు తన గురువు బాలచందర్‌కు ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలుసుకుంటారు

* రజనీకాంత్‌ ఉన్నప్పుడు ఇంటిలో నిత్యం ‘ఓం’కార నాదం వింటూనే ఉంటారు

* ఇష్ట దైవం వినాయకుడు

* తిరుపతి ఆలయంలోనే రజనీకాంత్‌ వివాహం జరిగింది

* రోడ్డుపక్కనున్న కాకా హోటళ్ల ప్రియుడు రజనీ

* పోరూర్‌ సిగ్నల్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఇప్పటికీ వెళ్లొస్తారట

* ఏవీఎం స్టూడియోలో రజనీకాంత్‌ మేకప్‌రూమ్‌ నెం.10

* చెన్నైలో షూటింగ్‌ అంటే రజనీకే కాకుండా, మరో 25 మంది వరకు భోజనం ఇంటి నుంచే వెళ్తుంది

* తన ఇంటిలో ఉద్యోగం చేస్తున్న అందరికీ నీలాంగరైలో ఓ ప్లాట్‌ను కొనిచ్చారు

* ‘ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే.. ప్రపంచంలోని ఏ శక్తి ఆపజాలదు’.. స్వామి వివేకానందుడి ఈ సూక్తే రజనీకాంత్‌ గుమ్మంపై ఉంటుంది

* రజనీకాంత్‌ మాంసాహార ప్రియుడు. ముఖ్యంగా మటన్‌, తలకాయ కూరంటే ఇష్టంగా తింటారు.

* తన చిత్ర షూటింగ్‌ పూర్తయ్యాక ఆ చిత్ర సహాయ దర్శకుడికి ఓ మొత్తాన్ని కానుకగా ఇవ్వటం రజనీకాంత్‌ అలవాటు. ఆ మొత్తం కనీసం రూ.50 వేలు.

* తమిళంతోపాటు, తెలుగు, కన్నడం, మలయాళం, మరాఠి, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగల

* అల్లుడు ధనుష్‌ ప్రతి పుట్టినరోజుకు ఓ వెండి కంచం, గ్లాస్‌ కానుకగా ఇస్తుంటారు.

*. ‘ముల్లుం మలరుం’ చిత్రంలో తన నటనను ప్రశంసిస్తూ కె.బాలచందర్‌ రాసిన ఉత్తరాన్ని నేటికీ ఆయన భద్రంగా దాచుకున్నారు