విరుష్క వివాహం హైలైట్స్

విరాట్ కోహ్లీ – అనుష్క శర్మలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత రాత్రి ఇటలీలో పంజాబీ సంప్రదాయ పద్దతిలో వీరి జరిగింది. ఆ వెంటనే మా పెళ్లి అయిపోయిందంటూ సడెన్ సప్రైజ్ ఇచ్చారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. ఈ ఇద్దరు ట్విట్టర్ లో సంయుక్త ప్రకటన విడుడుల చేశారు.
“జీవితంలో ఎప్పటికీ ప్రేమానుబంధం మధ్య కలిసి ఉంటామని నేడు మేమిద్దరం ఒకరికి ఒకరం ప్రమాణం చేసుకున్నాం. ఈ వార్తను మీ అందరితో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా కుటుంబసభ్యులు, అభిమానులు, బంధుమిత్రుల మద్దతుతో, ప్రేమ, ఆశీస్సులతో ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారింది. మా ప్రయాణంలో పాలుపంచుకున్నందుకు కృత జ్ఞతలు” అంటూ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. దీంతో పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు.
విరుష్క నిశ్చితార్థం, పెళ్లి ఒకే రోజు జరిగాయి. ముందు బంధువులు ఇరువురికి నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. నిశ్చితార్ధంలో ఆ ఇద్దరు ఉంగారాలు మార్చుకున్నారు. ఆ తర్వాత ప్రేమ పూర్వకంగా కౌగిలించుకున్నారు. ఆ వెంటనే విరాట్, అనుష్కలను పెండ్లి కుమారుడు, పెళ్లి కూతురిగా చేశారు. అనంతరం వీరి పెళ్లిని పంజాబ్ సాంప్రదాయం ప్రకారం జరిపారు.
వీరి పెళ్లికి అత్యంత తక్కువ మంది అతిథులు హాజరయ్యారు. ఆహ్వానాలు అందిన సచిన్, యువరాజులు కూడా వివాహ వేడుకకి హాజరుకాలేదు. ఇక, ఈ నెల 21న ఢిల్లీలో పెళ్లి రిసెప్షన్ వేడుక నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు.
