సమంత మేటరు.. పోలీసుల దాక వెళ్లింది !

షూటింగ్ సమయంలోని సినిమా పైరసీకి గురికావడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు రామ్ చరణ్ “రంగస్థలం” సినిమా కూడా పైరసీ భారీన పడింది. ఇటీవలే సినిమాలో రామ్ చరణ్ లుక్ రిలీజ్ చేశారు. ఊరమాస్ చిట్టిబాబు లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఇదే టైంలో సమంతకు సంబంధించిన రెండు, మూడు ఫోటోలు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో చిత్రబృందం తలలు పట్టుకొంటోంది.

లీకైన ఫోటోల్లో సమంత అచ్చంగా పల్లెటూరి ఆడపిల్లలా కనిపిస్తోంది. రెండు గేదెలను తీసుకొస్తున్న ఫోటో, పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తున్న ఫోటో, మోటర్ దగ్గర రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ లీకులు సినిమాని దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన చిత్రబృందం.. సైబర్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు లీకుల దొంగని పట్టుకొనే పనిలో ఉన్నారు.