కరుణానిధి శవపేటికపై ఆ మాటలు


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి గానే కాదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. స్టార్ రచయిత. మాటల మాంత్రికుడు. ఆయన తన అంతిమ యాత్ర కోసం కూడా లైన్ రాసుకొన్నాడు. దాన్ని 33యేళ్ల క్రితమే తన కొడుకు స్టాలిన్ కి చెప్పి ఉంచారు. మనం చనిపోయినప్పుడు ప్రజలు మన సమాధిని చూసి..‘విరామం లేకుండా పనిచేసిన వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నారు’ అనేంతగా పేరు తెచ్చుకోవాలి అని స్టాలిన్ కు కరుణ చెప్పారట. ఇప్పుడా మాటలని కరుణానిధి భౌతికకాయాన్ని ఉంచిన శవపేటికపై చెక్కించారు. ఇక, కరుణానిధి అంతిమ యాత్ర ప్రారంభమైంది. రాజాజీహాలు నుంచి వాలాజా రోడ్‌, చెపాక్‌ స్టేడియం, శివానంద రోడ్‌, తంతైపెరియార్‌ రోడ్‌ మీదుగా మెరీనా బీచ్‌ వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. మెరీనా బీచ్‌లోని మాజీ సీఎం అన్నాదురై స్మారక కేంద్రం సమీపంలో అన్నా స్క్వేర్‌ ప్రాంగణంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.