కలైంజ్ఞర్’కు కేసీఆర్ నివాళి

రాజకీయ దిగ్గజం కరుణానిధికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న కేసీఆర్ రాజాజీ హాల్లో ఉన్న కరుణానిధి పార్థివదేహానికి అంజలి ఘటించారు. కరుణానిధి కుటుంబసభ్యులను పరామర్శించారు. నివాళి అర్పించిన అనంతరం… జోహార్ కరుణానిధి అంటూ పిడికిలి బిగించారు కేసీఆర్. కేసీఆర్ తో పాటు ఆయన కూతురు, ఎంపీ కవిత కూడా కరుణానిధికి నివాళులర్పించారు.
