విశ్వరూపం 2 వాయిదా

అనుకొన్నదే జరిగింది. ‘విశ్వరూపం 2’ వాయిదా పడింది. కోర్టు కేసుల కారణంగా విశ్వరూపం 2 వాయిదా పడే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది. ఐతే, దానిపై కమల్ క్లారిటీ ఇచ్చారు. అనుకొన్న డేటుకే (ఆగస్టు10) విశ్వరూపం 2 ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు కరుణానిధి మరణంతో విశ్వరూపం 2 వాయిదా పడక తప్పలేదు.
కరుణానిధి మరణంతో తన చిత్రాన్ని వాయిదా వేయాలని కమల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళంతోపాటు హిందీలో కూడా విశ్వరూపం 2 విడుదల కానుంది. కమల్ స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌తోపాటు, ఆస్కార్ ఫిలింస్ విశ్వరూపం-2 ను సంయుక్తంగా నిర్మించాయి. ఒకవేళ ఆగస్టు 10న విడుదల వాయిదా వేస్తే.. ఆగష్టు 15న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో కమల్ ఉన్నట్టు సమాచారమ్.
విశ్వరూపం’ చిత్రానికి సీక్వెల్, ప్రీక్వెల్‌గా ‘విశ్వరూపం 2’ కథ తెరకెక్కింది. వైవిధ్యమైన కథ, సాంకేతికత కలగలిసిన ‘విశ్వరూపం 2’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని కమల్ చెప్పారు. కశ్మీరులోని ముస్లింగా జీవించడంలోని సవాళ్లతో ఈ సినిమాను రూపొందించబోతున్నారు.
