సచిన్ కొడుకు కోహ్లీ బ్యూటీని పట్టేశాడు


ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ గుర్తుందా.. ? ఇటీవలే ఈ బ్యూటీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి లవ్ ప్రపోజల్ చేసి వార్తల్లో నిలిచింది. ‘కోహ్లీ ప్రేమించానని చెబుతూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా ?’ అని ట్వీట్ చేసింది. ఇప్పుడీ బ్యూటీతో సచిన్ తనయుడు అర్జున్ లంచ్ డేట్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. సచిన్ తనయుడు కూడా మొదలెట్టాడుగా.. అని కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీలంకతో అండర్ -19 యూత్ టెస్టు సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ కోసం అర్జున్ ని ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి కూడా. ఈ సిరీస్ తర్వాత అర్జున్ ను ముంబై ఆఫ్ సీజన్ క్యాంప్ నకు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో అర్జున్ ఇంగ్లాండ్ కి వెళ్లాడు. అక్కడ కలిసి లంచ్ డేటుకెళ్లిన ఫోటోలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై సచిన్ రియాక్షన్ ఎంటన్నది చూడాలి.