కరుణానిధి స్క్రీన్ ప్లే అందించిన సూపర్ స్టార్ సినిమా

కరుణానిధి.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి గానే కాదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. స్టార్ రచయిత. తమిళ సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసిన వ్యక్తి కరుణానిధి. ఆయన కెరీర్‌లో మొత్తం 39 సినిమాలకు స్క్రిప్ట్‌ను అందించారు. తెలుగు చిత్ర పరిశ్రమతో కూడా ఆయన అనుబంధం ఉంది. రామానాయుడు నిర్మించిన ‘ప్రేమనగర్’ సినిమా శతదినోత్సవ వేడుకకు కరుణ హాజరయ్యారు. దాసరి దర్శకత్వం వహించిన ‘నీడ’ చిత్ర శతదినోత్సవానికి కూడా కరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చాలా తక్కువ మందికి తెలిసిన మరో విషయం ఏమిటంటే.. ఆయన ఓ తెలుగు సిసిమాకు స్క్రీన్ ప్లేని అందించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అమ్మాయి మొగుడు-మామకు యముడు’ సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే రాశారు. తమిళంలో జయశంకర్, జయచిత్ర జంటగా నటించిన ‘వండిక్కారణ్ మగన్’ చిత్రానికి తెలుగు అనువాదమే ఈ సినిమా. కరుణ మేనల్లుడు మురసోలి సెల్వం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. చివరిగా 2011లో త్యాగరాజన్‌ దర్శకత్వంలో ప్రశాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘పొన్నార్‌ శంకర్‌’ చిత్రానికి కథ అందించారు.