మహేష్ డబుల్ దమాఖా

అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. రేపు (ఆగస్టు9) మహేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా వంశీపైడి పల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మహేష్ 25వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం హింట్ ఇచ్చింది. ఆగస్టు 9 నుంచి మా ప్రయాణం మొదవ్వనుందని చెప్పారు. ఆర్, ఐ, ఎస్, హెచ్, ఐ అనే ఆంగ్ల అక్షరాలని రోజుకోటి విడుదల చేస్తూ మహేష్ ‘రిషి’గా కనిపించబోతున్నట్టు చెప్పకనే చెప్పింది. ‘రిషి’ సినిమాలో మహేష్ పేరా ? అదే టైటిల్ అనేది తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందేనని సస్పెన్స్ ని క్రియేట్ చేసింది.
ఇప్పుడీ సస్పెన్స్ కు తెరపడే సమయం దగ్గరపడింది. మరికొన్ని గంటల్లో మహేష్ 25 వ టైటిల్ పై పూర్తి క్లారిటీ రానుంది. సినిమాలో మహేష్ లుక్ కూడా బయటకురానుంది. టైటిల్, ఫస్ట్ లుక్ నే కాదు.. టీజర్ ని కూడా విడుదల చేస్తారట. ఊహించని ఈ గిఫ్ట్ తో ప్రిన్స్ అభిమానులు డబుల్ హ్యాపీ కావడం ఖాయం. ఒకేసారి టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్.. అంటే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోవడం గ్యారెంటీ. ఇక, ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కనిపించనున్నారు. దేవిశ్రీ సంగీతం. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.
