కమల్ కాదంటే.. విక్రమ్, అర్జున్’లు రెడీగా ఉన్నారట !

కమల్‌హాసన్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ సంచలనం సృస్టించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. రోబో ‘2.O’ నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ‘భారతీయుడు2’ని నిర్మించనుంది. ‘2.O’ నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ‘భారతీయుడు’ సీక్వెల్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.
‘భారతీయుడు 2’లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరిగింది. అది నిజమేనని ఇటీవలే కమల్ క్లారిటీ ఇచ్చారు. కమల్ సరసన నయనతార జతకట్టనుందని చెబుతున్నారు. అంతా బాగానే ఉన్న ఈ సినిమాపై కమల్ పెద్దగా ఆసక్తిని చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కమల్ పొటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. తాను సినిమాలతో బిజీగా ఉంటే.. రాజకీయపరమైన పనులకు ఇబ్బంది కలుగుతుందని కమల భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలో ‘భారతీయుడు 2’ నుంచి కమల్ తప్పుకొనే అవకాశం ఉందని కోలీవుడ్ సమాచారమ్. ఒకవేళ ఇదే జరిగితే.. కమల్ స్థానంలో చినాయ్ విక్రమ్, యాక్షన్ కింగ్ అర్జున్ లలో ఎవరో ఒకరిని తీసుకోవాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అర్జున్ తో శంకర్ చేసిన జెంటిల్ మన్, ఒకే ఒక్కడు సూపర్ హిట్టయ్యాయి. విక్రమ్ తో అపరిచితుడు, ఐ సినిమాలు చేశాడు శంకర్. ఇప్పుడు కమల్ కాదంటే.. భారతీయుడుగా అర్జున్, విక్రమ్ లలో ఒకరిని చూపించబోతున్నాడట.
