కేటీఆర్.. ఇవాళ ఎక్కడ ?

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తెలంగాణలోని మొత్తం 16ఎంపీ స్థానాలని తెరాస గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కేటీఆర్ నేడు గ్రేటర్ హైదరాబాద్ లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ని తెరాస విడుదల చేసింది.

* సాయంత్రం 5 : 30 – అలీ కేఫ్

* సాయంత్రం 6 : 30 – ఫీవర్ హాస్పటల్

* సాయంత్రం 7 : 30 – రాంనగర్ లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు.