చెన్నైకి చెక్ పెట్టిన ముంబై


ఐపీఎల్‌ 12వ సీజన్ లో ధోనీసేనకు తొలి ఓటమి రుచి చూపింది ముంబయి ఇండియన్స్‌. బుధవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటి 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట సూర్యకుమార్‌ యాదవ్‌ 59, కృనాల్‌ పాండ్య 42, హార్దిక్‌ పాండ్య 25 నాటౌట్‌ మెరుపులతో ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది.

అనంతరం చెన్నై 133/8కే పరిమితమైంది. కేదార్‌ జాదవ్‌ 58 టాప్‌స్కోరర్‌. హార్దిక్‌ పాండ్య (3/20), మలింగ (3/34), బెరెన్‌డార్ఫ్‌ (2/22) చెన్నైకి కళ్లెం వేశారు. హార్దిక్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. నాలుగు మ్యాచ్‌ల్లో ముంబయికిది రెండో విజయం. కాగా,
ఐపీఎల్‌-12లో ధోని జట్టుకు ఇది తొలి ఓటమి.