ఎన్టీఆర్-‘ప్రణతి బంధానికి ఎనిమిదేళ్లు’ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జీవితంలో ‘మే5’ చాలా ముఖ్యమైన రోజు. ఆయన పెళ్లిరోజు. 2011, మే5న ఎన్టీఆర్-ప్రణతిల వివాహం జరిగింది.
ఎనిమిదో పెళ్లి రోజు జరుపుకొంటున్న తారక్ భార్యతో కలిసి దిగిన ఓ ఫోటోని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఎనిమిదేళ్లు!! ఇలాంటివి ఎన్నో రావాలని ఎదురుచూస్తున్నా’ అని సింపుల్ క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో తారక్ దంపతులకి సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి పెళ్లిరోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
2011, మే5న ఎన్టీఆర్-ప్రణతిల వివాహం జరిగింది. వీరికి 2014లో తొలి సంతానం కలిగింది. కొడుకు అభయ్ రామ్ పుట్టాడు. గత యేడాది జూన్‌లో రెండో సంతానంగా మళ్లీ కుమారుడే జన్మించాడు. ఇక, సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తారక్ రాజమౌళి
‘ఆర్.ఆర్.ఆర్’ మల్టీస్టారర్ లో నటిస్తున్నారు. మరో కథానాయకుడుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇందులో తారక్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఆయనకి జంటగా నటించే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. చరణ్ కి జంటగా అలియా భట్ నటిస్తోంది.
