మీరు.. నా దొరసాని !

హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం ‘దొరసాని’. జీవిత రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్. ఈ చిత్రానికి కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘పెళ్లి చూపులు’ సినిమా నిర్మాత యష్ రాగినేని – మధుర శ్రీధర్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ స్టోరీగా దొరసాని తెరకెక్కుతోంది.

తాజాగా, ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ‘దొరసాని’ టైటిల్ కి తగ్గట్టుగానే కథని తెలంగాణలో నిజాంల కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. చినదొరసాని గడీల నుంచి బయటికే రాదు వాయిస్ తో టీజర్ మొదలైంది. వీకేం తెల్వదు పీకద్. దొరసాన్ లెప్పుడైనా బయటికొత్తార్రా అని ముగ్గురు పొరగాళ్లు అనడం.. చూడొచ్చు.

స్టోరీ లైన్ గురించి పక్కన పెడితే.. ఆనంద్, శివాత్మిక చక్కగా సరిపోయారు. ఆనంద్ నటన మతిపోగోట్టేలా ఉంది. అన్నయ్య విజయ్ దేవరకొండని మించిపోయేలా ఉన్నాడు. తెలంగాణ పొరడుగా జీవించేశాడని చెప్పవచ్చు. శివాత్మిక దొరసానిగా చక్కగా సరిపోంది. ఆమెకు మాటల్లేవ్. కళ్లతో నటించేసింది. చూస్తేంటే.. ఈ జంట మాయ చేసేలా ఉంది. ‘దొరసాని’ టీజర్ సినిమాపై అంచచాలని పెంచేసిందని చెప్పవచ్చు.