ఏం తేల్చారు పవన్ ?

ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారని భావించారు. కానీ, పవన్ ఈ రెండింటిలో ఏదీ కాలేదు. ఇంకా చెప్పాలంటే.. ఎటు కాకుండా పోయాడు. కనీసం సృహాలో కూడా లేదు. ఏపీలో జనసేన కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకొంది. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో ఏపీలో పవన్ ప్రభావం సున్నా అని తేలింది.

ఈ సున్నా భవిష్యత్ లో సెంచరీ కొట్టొచ్చేమో.. ! ఇప్పుడు మాత్రం ఈ సున్నాపై సమీక్ష జరగాల్సిందే. పవన్ కూడా అదే చేశాడు. గురువారం మంగళగిరిలో ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఓటమిపై కారణాలని విశ్లేషించారు. పార్టీ నేతల్లో ధైర్ఘ్యం నింపే ప్రయత్నం చేశారు. ఓటమిని ఓటమిగా కాకుండా ఓ అనుభవంగా తీసుకుంటామని చెప్పారు.

పార్టీని ఎదగనీయకుండా కొన్ని బలమైన శక్తులు పనిచేయడంతోనే వ్యతిరేక ఫలితాలు చూడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆ దృష్ట్య శక్తులు ఎవరు ? అన్నది మాత్రం పవన్ చెప్పలేదు. పార్టీకి జనబలం ఉందని, ఆ బలాన్ని పార్టీ కోసం వినియోగించుకోవడమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమని నేతలకు సూచించారు. తుదిశ్వాస ఉన్నంత వరకు పార్టీని ముందుకు తీసుకెళ్తూనే ఉంటానని స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలు, అభ్యర్థుల ఎంపిక వంటివాటిపై దృష్టి పెడతామన్నారు జనసేనాని.