వరల్డ్ కప్ : విండీస్’పై ఆసీస్ విజయం

ప్రపంచ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌ లో ఆసీస్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 288పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆరంభంలో విండీస్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా ఆసీస్ 8 ఓవర్లకి ఆసీస్‌ 38/4 గా నిలిచింది. 17ఓవర్లకి 79/5. 31 ఓవర్లకి 148/6. ఐతే, స్మిత్‌(73; 102బంతుల్లో 7×4), కౌల్టర్‌నైల్‌(89) రాణించడంతో ఆసీస్ 288 పరుగులు చేయగలిగింది.

289 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఆస్ట్రేలియా 15పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలిపిస్తాడనుకున్న సారథి హోల్డర్‌(51; 57బంతుల్లో 7×4, 1×6) కీలక సమయంలో చేతులేత్తేశాడు. 46ఓవర్‌ చివరి బంతికి జంపా చేతికి చిక్కాడు. హోల్డర్‌ అవుటైన తర్వాత ఆసీస్ విజయం ఖాయమైంది.