నా జీవితం కంటే నా స్టాఫ్‌ సభ్యుల లైఫ్‌ బెటర్ : బన్నీ

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశాంతత కోరుకుంటున్నట్టు కనబడుతోంది. తన స్టాఫ్ సభ్యులు చేసుకొనే పార్టీకి తనని కూడా పిలవచ్చుకదా అంటున్నాడు. బన్నీ స్టాఫ్ ప్రతి శనివారం రాత్రి పార్టీలు చేసుకుంటూ ఉంటారట. ఈ విషయాన్ని బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ఈ శనివారం బన్నీ స్టాఫ్ పార్టీ చేసుకొన్న ఫోటోని ఆయన షేర్ చేశాడు.

ఆదివారం ఉదయాన్నే నాకు కనిపించే దృశ్యం ఏంటంటే.. నా స్టాఫ్‌ సభ్యులు శనివారం రాత్రి పార్టీలు చేసుకుని ఫొటోలు దిగడం. రాత్రి వేళల్లో వారు ఎంజాయ్‌ చేసే విధానం చూస్తే వారి జీవితం నాకంటే ఎంతో ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. ’ అని చమత్కరించారు. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వచ్చే యేడాది సంక్రాంత్రికి బన్నీ-త్రివిక్రమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.