సందీప్ రెడ్డి కామెంట్స్‌పై సమంత అసంతృప్తి

బాలీవుడ్ లోనూ బోణికొట్టాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన తెరకెక్కించిన ‘కబీర్ సింగ్’ (అర్జున్‌రెడ్డి రీమేక్) సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్.. కియారా అడ్వాణీని ముద్దుపెట్టుకునే సన్నివేశాల గురించి సందీప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ కనిపించదని నా అభిప్రాయం’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై సమంత అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘ఈ వ్యాఖ్యలు చాలా అసంతృప్తికరంగా ఉన్నాయి’ అని సామ్ ట్విట్ చేశారు. సామ్ కామెంట్ ని ఓ ఆంగ్ల మీడియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘అప్పుడేమో ‘అర్జున్‌రెడ్డి’ సినిమా బాగుందన్నారు. ఇప్పుడు సందీప్ వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయి అంటున్నారు. సమంతది రెండు నాల్కల ధోరణి అని రాసుకొచ్చారు. దీనికి సమంత రిప్లై ఇచ్చింది. ‘ఒక సినిమాను ఇష్టపడటం వేరు. ఒకరు చేసిన వ్యాఖ్యలతో విభేదించడం వేరు. నాకు ‘అర్జున్‌రెడ్డి’ కథ బాగా నచ్చింది. దానర్థం ఇష్టమొచ్చినట్లుగా మనతో ఉన్నవారిపై చేయి చేసుకునే కాన్సెప్ట్ కూడా నాకు నచ్చిందని కాదు’ అని బదులిచ్చింది. మరీ.. సమంత కామెంట్స్ పై సందీప్ వంగా ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
