గొల్లపూడి అంత్యక్రియలు ఎప్పుడంటే ?

ప్రముఖ రచయిత, సంపాదకుడు, నటుడు గొల్లపూడి మారుతి రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని లైఫ్‌లైన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గొల్లపూడి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో ఆయన రెండో కుమారుడు రామకృష్ణ తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని గొల్లపూడి నివాసానికి తరలించి ఆదివారం మధ్యాహ్నం వరకూ అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు.

గొల్లపూడి మారుతీ రావు 1939 ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వీరు విశాఖపట్టణంలో జీవించే వారు. సి.బి.ఎం. ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయము లలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమేటికల్ భౌతిక శాస్త్రములో బి.యస్‌సీ (ఆనర్స్) చేశాడు.మారుతీరావుకు ముగ్గురు మగ సంతానం సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. వీరిలో శ్రీనివాస్ దర్శకుడిగా తొలి సినిమా చేస్తూ.. ప్రమాదంలో మృతి చెందారు. దాదాపు 250 చిత్రాలకి పైగా నటించారు. మారుతీరావు నటునిగా ప్రధానపాత్ర పోషించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. ఆయన నటించిన చివరి చిత్రం జోడీ.