ఓటేసిన ధోని

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం మూడో విడత పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రానికి భార్య సాక్షితో వచ్చిన ధోనీ ఓటు వేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మూడో విడతలో భాగంగా ఝార్ఖండ్‌లో 17 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. 17 అసెంబ్లీ స్థానాల్లో 309 మంది బరిలో దిగారు. ఇందులో 32 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.డిసెంబరు 16న నాలుగో దశ, డిసెంబరు 20న ఐదో దశ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు 23న ఫలితాలు వెలువడనున్నాయి.
