2020-తొలిరోజు నుంచే మంటలు

ప్రపంచం 2020లోకి అడుగుపెట్టేసింది. కొత్త యేడాదిలో ఎంట్రీ ఇస్తున్న వేళ తీపికబరు చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజలకి షాక్ ఇస్తూ.. ధరలని పెంచేశాయి. రైల్వే ఛార్జీలు, ఎల్ పీజీ సిలిండర్ ధరలని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన రేట్లు డిసెంబర్ 31 అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చేశాయి. 

రైల్వే ధరలని స్వల్పంగా పెంచిన సంగతి తెలిసిందే. కిలో మీటరుకి పైసా చొప్పున పెంచారు. ఇక నాన్‌-స‌బ్సిడీ ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌ను పెంచేశారు. సిలిండ‌ర్‌పై 19 రూపాయాలు పెంచారు. పెంచిన ధ‌ర‌లు బుధవారం (జనవరి1) నుంచే అమ‌లులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 2020తొలిరోజు నుంచే సామాన్యుడిపై భారం పడినట్టయింది. ఇక ఈ యేడాదిలో ఇంకెన్ని సామాన్యుడు ఇంకెన్ని షాకులు చూడాల్సి వస్తుందో.. !