ప్రదీప్ హీరోగా పనికిరాడు

యాంకర్ ప్రదీప్ హీరోగా పనికిరాడు అంటున్నాడు ఓ దర్శకుడు. ఎందుకంటే.. ? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్ ఓ సినిమాలో హీరోగా నటించడం నిబంధనలకు విరుద్ధం.ఆయనపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు దర్శకుడు శ్రీరామోజు సునిశిత్. ఇతడిది మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని రాంపల్లి గ్రామం.
ప్రదీప్ గతంలో ఒక అమ్మాయిని వేధించిన ఘటనలో రెండు రోజులు జైలుకు వెళ్లివచ్చారని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రదీప్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారని శ్రీరామోజు ఆరోపించారు. ప్రదీప్‌తో పాటు సినీ దర్శకుడు కూడా నిబంధనలను అతిక్రమించారన్నారు. ప్రస్తుతం జరుగుఈ షూటింగ్ ఆపాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదు సదరు దర్శకుడు పేర్కొన్నారు. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాతో ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరామోజు చేసిన ఫిర్యాదు హాట్ టాపిక్ గా మారింది.
