నయన్.. ఈ రేంజ్ లో టార్చర్ పెడుతుందా !?

స్టార్ హీరోయిన్ నయనతార నిర్మాతలని బాగా ఇబ్బంది పెడుతుందనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేస్తుంటుంది. టైమ్ కి షూటింగ్ కి రాదు. పైగా ప్రమోషన్స్ వైపు చూడదని చెబుతుంటారు. నయన్ తో అసలు సమస్య ఇది కాదట. ఆమె పెట్టే టార్చర్ ఓ రేంజ్ లో ఉంటుందట. ఈ విషయాలని తాజాగా ఓ తమిళ నిర్మాత బయటపెట్టాడు.
నయనతార ఒక సినిమాని ఒప్పుకుంటే.. ఆ సినీ నిర్మాతకు చుక్కల కనిపించటం ఖాయమట. సినిమా షూటింగ్ మొదలైన రోజు నుండి తన వ్యక్తిగత స్టాఫ్ ఖర్చుల నిమిత్తం 85 వేల రూపాయలను వసూల్ చేస్తోందట. ఇక అవుట్ డోర్ షూటింగ్ జరిగే సమయంలో నయనతార స్టాఫ్ యొక్క ఖర్చు తారాస్థాయికి చేరుకుంటుందట. వాస్తవానికి వ్యక్తిగత స్టాఫ్ ఖర్చులను నయనతారే భరించాలి. కానీ ఆమె ప్రాజెక్టు ఒప్పుకునే ముందు.. తన స్టాఫ్ ఖర్చులను కూడా నిర్మాత భరించాలని కండిషన్ పెడుతుంది.
ఒక్క రోజుకి నయనతారకు మేకప్ వేసే వ్యక్తి 8000 రూపాయలను వేతనంగా తీసుకుంటారట. అయితే ఈ డబ్బులన్నీ నిర్మాతే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇలా ఓ సినిమా పూర్తయ్యేలోపు తన పర్సనల్ స్టాఫ్ ఖర్చులన్నీ 40 నుండి 50 లక్షలు అవుతాయట. నయన్, ఆమె పర్సనల్ స్టాప్ కోసం ఇంత ఖర్చు చేసినా.. ఆమె సినిమా ప్రమోషన్స్ కోసం పిలిస్తే.. అస్సలు రాదు. ఈ కండిషన్ ని కూడా ఆమె ముందుగానే పెడుతోంది. వీటినన్నింటిని త్వరలోనే బయటపెడతాం. ఆమెపై చర్యలు తీసుకొంటాం అంటున్నారు సదరు నిర్మాత. బహుశా.. నయన్ ని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసే ప్రయత్నాలేమైనా చేస్తారేమో.. !
