కివీస్.. క్లీన్ స్వీప్ !

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా జోరు కొనసాగుతోంది. కివీస్ కి గుండ్ గీశారు. ఆఖరి టీ20లోనూ కివీస్ పై టీమిండియా గెలుపొందింది. దీంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి మ్యాచ్  లో కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలని నిర్వహించారు. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది.

రాహుల్‌ (45), సంజు (2), రోహిత్‌ శర్మ (60) (రిటైర్డ్‌ హర్ట్‌) పరుగులు చేయగా, శ్రెయాస్‌ (33) (నాట్‌ ఔట్‌), శివం దుబే (5) (నాట్‌ ఔట్‌) పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లు బెన్నెట్‌ ఒక వికెట్‌, కుగ్గెలిన్‌ రెండు వికెట్లు తీశాడు. 164 పరుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఓ దశలో ఈజీగా గెలిచినట్టే కనిపించింది. కానీ చివరలో ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు కోల్పోయింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్ లో టీమిండియా గెలిచిన తొలి టీ20 సిరీస్ ఇదే కావడం విశేషం.