బన్నీ బర్త్ డే గిఫ్ట్ అల.. ప్లాన్ చేస్తున్నారంట

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్తూరు ప్రాంతంలో సాగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. బన్ని ఇందులో రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడని ఇటీవలే వార్తలొచ్చాయి. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఫస్ట్ లుక్ రాబోతున్నట్టు సమాచారమ్.

ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. ఇటీవల ఈ సినిమా కోసం బన్నీపై లుక్ టెస్ట్ నిర్వహించారు. ఫైనల్ గా లుక్ ని సెట్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోల నుంచి ఓ ఫోటోని ఫస్ట్ లుక్ గా వదలనున్నారని తెలుస్తోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే పేరు పరిశీలనలో ఉంది. అయితే ఆర్య, ఆర్య2 సెంటిమెంట్ ని ఫాలో అయి.. ఆ పేరుతో రెండక్షరాల టైటిల్ కోసం కసరత్తులు జరుగుతున్నట్టు లెటెస్ట్ న్యూస్.