ప్రభాస్ గురించి ఎన్నిసార్లు అడుగుతారు ?

హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ పలు తెలుగు సినిమాల్లో నటించింది. అయితే ప్రభాస్ ‘మిర్చి’ సినిమా ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పటికీ రీచా ఎక్కడ కనిపించినా మిర్చి ముచ్చట్ల గురించి అడుగుంటారు నెటిజన్స్. పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైన రీచా ఎప్పుడు ఆన్ లైన్ లో కనిపించినా.. మిర్చి సినిమా ప్రభాస్ గురించి అడుతుంటారు అభిమానులు.
తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన రీచాతో ప్రభాస్ అభిమానులు రచ్చ చేశారు. ఓ నెటిజన్.. ‘మేడమ్ ప్రభాస్ గురించి ఒక్కమాట చెప్పండి. మానస (‘మిర్చి’లో పాత్ర) మీరు సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నా’ అని కామెంట్ చేశారు. దీనికి రిచా స్పందిస్తూ.. ‘ప్రభాస్ నిజంగా ఓ అద్భుతమైన వ్యక్తి. చాలా వినయంగా ఉంటారు. నాకిష్టమైన సహ నటుల్లో ఆయనొకరు’ అని చెప్పారు. మరో నెటిజన్ కూడా.. ‘ప్రభాస్ గురించి ఒక్క మాట చెప్పండి?’ అని అడిగారు. ‘మీరు ‘వన్ వర్డ్’ ఎన్నిసార్లు అడుగుతారు.. నేను ఇప్పటికే మీకు చెప్పాను..’ అని నవ్వుతూ రిచా సమాధానం ఇచ్చారు.
