త్రివిక్రమ్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న బన్నీ

దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ అన్నీ ‘అ’తో మొదలయ్యేలా చూసుకొంటారు. అతడు, అజ్ఝాతవాసి, అఆ, అల.. వైకుంపురంలో ఇలా అ సెంటిమెంట్ ని ఫాలో అవుతుంటారు త్రివిక్రమ్. ఇప్పుడు ఈ సెంటిమెంట్ బన్నీకి కూడా పట్టిందని చెబుతున్నారు. బన్నీ 20వ సినిమా దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం శేషాచలం అనే టైటిల్ వినిపించింది. ఇప్పుడు సడెన్ గా అల్లు అర్జున్ కి ఆ సెంటిమెంట్ గుర్తొచ్చిందని చెబుతున్నారు.
సుకుమార్ – బన్నీ కాంబోలో వచ్చిన సినిమాలు ఆర్య, ఆర్య 2 హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాకి కూడా ఆ అక్షరంతో టైటిల్ అనుకుంటారని చెప్పుకొంటున్నారు. అసలు వాస్తవం ఏంటంటే.. ? అల.. వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ ప్రభావం బన్నీపై బాగా పడిందట. అందుకే త్రివిక్రమ్ సెంటిమెంట్ తో అ అక్షరంతో టైటిల్ వచ్చేలా చూడమని బన్నీ కోరినట్టు తెలుస్తోంది.
ఇక బన్నీ 20వ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనుందట. అల్లు అర్జున్ లారీ డ్రైవర్గా కనిపించనుండగా.. విజయ్ సేతుపతి పోలీస్ పాత్రలో, రష్మిక మందన్న పల్లెటూరి యువతిగా నటించబోతున్నట్లు టాక్. జగపతి బాబు, రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో
కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
