విజయ్ కి మెగా సపోర్ట్

#KillFakeNews పేరిట టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ ఓ ఉద్యమమే స్టార్ట్ చేశాడు. వెబ్ సైట్స్ లో ఫేక్ న్యూస్ పై విజయ్ ఓ వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఫేక్ న్యూస్ వెబ్ సైట్స్ పై ఓ రేంజ్ లో వేసుకున్నాడు. వెబ్ సైట్స్ ప్రచారం చేసే ఫేక్ న్యూస్ ని ఎవరు నమ్మవద్దని విజ్ఝప్తి చేశారు. తనపై వస్తున్న వార్తల్లో 80 శాతం ఫేక్ వార్తలే ఉంటున్నాయని వాపోయారు. విజయ్ మొదలెట్టిన #KillFakeNews ఉద్యమానికి టాలీవుడ్ మొత్తం సపోర్ట్ గా నిలవడం విశేషం. 

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, నాగాబాబు.. తదితరులు విజయ్ వెనక మేము ఉన్నామంటూ ట్విట్ చేశారు. #KillFakeNews అంటూ నినదించారు. వారికి విజయ్ దేవరకొండ థ్యాంక్స్ చెప్పారు. చూస్తుంటే… ఫేక్ న్యూస్ వెబ్ సైట్స్ అంతం చూసే వరకు విజయ్ దేవరకొండ వదిలేలా లేదు.