వైరల్ : మందుబాబులపై పూల వర్షం

మూడో విడత లాక్‌డౌన్ లో మందుబాబులని ఖుషి చేసింది కేంద్ర ప్రభుత్వం. మద్యం షాపులని తెరిచేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం మందు షాపులు తెరచుకోగానే మందుబాబులు.. మద్యం కొనేందుకు బారులు తీరారు. అయితే ఢిల్లీలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

‘మీరే దేశ అర్థిక వ్యవస్థని కాపాడేది అంటూ మందుబాబులపై ఓ వ్యక్తి పూల వర్షం కురిపించాడు. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్, మందుబాబులే ప్రభుత్వ ఖజానాని నింపేది’ అంటూ న్యూఢిల్లీలో చందేర్‌ నగర్‌లోని ఓ వైన్‌ షాప్‌ ఎదుట బారులుతీరిన మందుబాబులపై
పూలు చల్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.