జూన్ రెండో వారం నుండి షూటింగులకు అనుమతి?

కరోనా లాక్‌డౌన్ షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయ్యాయ్. తిరిగి ఎప్పుడు తెరచుకుంటాయి అన్నది క్లారిటీ లేదు. అయితే మూడో విడత లాక్‌డౌన్ కేంద్రం మొత్తం 17రంగాలకి మినహాయింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకి షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలనే విజ్ఝప్తులు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ సినీ నిర్మాతలు మంత్రి తలసాని శ్రీనివాస్ తో సమావేశం అయ్యారు.

షూటింగ్ లకి అనుమతి, థియేటర్స్ రీ ఓపెన్ పై మంత్రితో చర్చించారు. కరోనా ఎఫెక్ట్ తో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తక్కువ మందితోనే షూటింగ్స్ ఉంటాయి.. కాబట్టి అందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అందుకు మంత్రి తలసాని కూడా సానుకూలంగా స్పందించారు. జూన్ రెండో వారం నుంచి షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని సమాచారమ్.

సమావేశం అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. సినీ నిర్మాతలు ఇచ్చిన సూచనలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా. ఆ తర్వాత మరోసారి సినీ నిర్మాతలతో సమావేశమై.. ఓ నిర్ణయం తీసుకుంటామని తలసాని అన్నారు. సినీ పరిశ్రమకి ఏ సాయం అవసరమైనా అందించడానికి రెడీగా ఉన్నట్టు తెలిపారు