ఆ.. వెబ్ సైట్స్ పై విజయ్ ఫైర్ !

హీరో విజయ్ దేవరకొండకి కాలింది. పిచ్చి రాతలు రాసే వెబ్ సైట్స్ ని ఏకిపారేశారు. కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని ఆదుకునేందుకు విజయ్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మిడిల్ క్లాస్ ఫండ్ ని ఏర్పాటు చేశారు. అయితే దీనిపై వెబ్ సైట్స్ తప్పుడు రాతలు రాయడంతో.. విజయ్ కి కాలింది.

ఈ నేపథ్యంలో వెబ్ సైట్స్ పై విజయ్ ఫైర్ అయ్యాడు. ఈ మేరకు విజయ్ ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో ఓ వెబ్ సైట్ తనపై రాసిన తప్పుడు రాతలని చదివి వినిపించారు. రెండ్రోజుల క్రిందట సదరు వెబ్ సైట్ వారు ఇంటర్వ్యూ అడిగారు. కుదరదని చెప్పేసరి.. ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఇలాంటి వార్తలని నమ్మొదని ప్రజలకి విజ్ఝప్తి చేశారు. విజయ్ ఇంకా ఏమన్నాడో.. మీరే వినండీ.