ఏపీలో మద్యం అమ్మకాలు నిలిపివేత

మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో సోమవారం ఏపీలో మద్యం షాపులు తెరచుకున్న సంగతి తెలిసిందే. దీంతో మద్యం షాపులకి మందుబాబులు బారులు తీరారు. కిలో మీటర్ల మేర క్యూలో నిలబడ్డారు.
ఈ సమయంలో లాక్డౌన్ నిబంధనలని పట్టించుకోలేదు. మందు దొరికితే.. ఈ జీవితానికి చాలు అన్నట్టుగా ప్రవర్థించారు. దీనిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. మద్యం అమ్మకాలతో మళ్లీ కరోనా విజృంభించే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మద్యం అమ్మకాలని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం షాపుల వద్ద రద్దీని, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం టోకెన్ పద్ధతిని తీసుకొచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
