టాలీవుడ్’లో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్ కి కరోనా ?

సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడానే లేదు. అందరికి కాటేస్తోంది కరోనా మహమ్మారి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ లో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్ కరోనా బారినపడినట్టు సమాచారమ్.

ఈ ఇద్దరు కూడా ఆంధ్రలోని ఓ కోస్తా ఏరియా డిస్ట్రిబ్యూటర్లు అని తెలుస్తోంది. వీరిద్దరు హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. వీరిలో ఒకరు మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు అని చెబుతున్నారు. అతడు చికిత్స కోసం కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరేందుకు ప్రయత్నించారని.. అడ్మిషన్ దొరికింది. కానీ బెడ్ మాత్రం దొరకలేదని తెలుస్తోంది. ఇక త్వరలో సూపర్ స్టార్ తో సినిమా చేయబోయే సంస్థలోని ఓ చిరు ఉద్యోగి కూడా కరోనా బారిన పడినట్టు సమాచారమ్. ఇవన్నీ కూడా ప్రచారాలు మాత్రమే. వీటిపై అధికారిక న్యూస్ రావాల్సి ఉంది.