వెంకీకి నితిన్ కాస్ట్లీ గిఫ్ట్

భీష్మ దర్శకుడు వెంకీ కడుములకి హీరో నితిన్ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. మంగళవారం పుట్టినరోజుని జరుపుకున్న వెంకీకి నితిన్ ల్యాండ్ రోవ‌ర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని ఖరీదు రూ. కోటిపైనే. ఈ యేడాది వీరి కాంబోలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాలుగేళ్ల తర్వాత నితిన్ కి హిట్ ఇచ్చిన చిత్రమిది. ఈ సినిమాలో నితిన్ కి జంటగా రష్మిక మందన నటించారు. సీతార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. భారీ లాభాలు తెచ్చిపెట్టిన భీష్మ నితిన్ కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా నిలిచింది.

ఆ ఆనందాన్ని ఇలా వెంకీకి కాస్ట్లీ గిఫ్ట్ రూపంలో వ్యక్తం చేశారు నితిన్. నితిన్ గిఫ్ట్ పై వెంకీ ఆనందం వ్యక్తం చేశారు. ఉత్త‌మ వ్య‌క్తుల‌తో మంచి సినిమాలు చేస్తే ఇలాంటివే జ‌రుగుతాయి. ఇంత మంచి బ‌హుమ‌తి ఇచ్చినందుకు థ్యాంక్యూ అంటూ త‌న సంతోషాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. ఇక వెంకీ కడుముల తన తదుపరి సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారమ్. ‘ఆర్ఆర్ఆర్’ త‌ర్వాత రామ్‌ చ‌ర‌ణ్ వెంకి కుడుములతో సినిమా చేయబోతున్నట్టు సమాచారమ్.