బ్యాడ్ న్యూస్ : ఆక్సఫర్డ్ కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిలిపివేత

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఈ మహమ్మారిపై విజయం సాధించేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కరోనా వాక్సిన్ తీసుకొచ్చే పనిలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 9 వాక్సిన్ లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. వీటిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఒకటి.
అయితే ఈ వాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయిల్ వికటిచింది. బ్రిటన్ పౌరుడికి ఇచ్చిన డోసు వలన చెడు ప్రభావం తలెత్తడం గుర్తించారు. దీంతో క్లినికల్ ట్రయల్స్‌ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనికా ప్రకటించింది. ప్రయోగ ప్రామాణిక ప్రక్రియ, వ్యాక్సిన్ భద్రతపై పూర్తిస్థాయి సమీక్ష కోసం ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. దీంతో పలు దేశాల్లో జరుగుతున్న ఈ వ్యాక్సిన్ ప్రయోగం నిలిచిపోయింది.
