కరోనా ఎఫెక్ట్ : యాదాద్రి ఆలయం మరోసారి మూసివేత

కరోనా మహమ్మారి దేవుళ్లని కూడా వదలడం లేదు. కరోనా లాక్డౌన్ లో భాగంగా దేశవ్యాప్తంగా అన్నీ దేవాలయాలు రెండు నెలలకు పైగా మూతపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అన్ లాక్ సడలింపుల్లో భాగంగా దేవాలయాలు తిరిగి తెరచుకున్నాయ్. అయితే కరోనా ఎఫెక్ట్ తో తాజాగా యాదాద్రి లక్ష్మీనరసింహా ఆలయం మూతపడింది.
ఇటీవల ఆలయంలోని ప్రధానార్చకులతో పాటు మరో ఇద్దరు అర్చకులు, సిబ్బందికి కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆలయాన్ని మూడు రోజులు మూసేయాలని నిర్ణయించారు.అయితే స్వామి వారికి అన్నీ రకాల పూజలు జరుగుతాయి. ప్రతిరోజే స్వామివారి కైంకర్యాలను ఏకాంతంగానే నిర్వహిస్తారు. అయితే భక్తులని మాత్రం అనుమతినివ్వరు. అయితే భక్తుల సౌకర్యం కోసం ఆన్లైన్ సేవలు, దర్శనాలు అందుబాటులోకి తెచ్చారు. ఇక యాదాద్రి-భువనగిరి జిల్లాలోనూ కరోనా విజృంభిస్తోంది. గ్రామాల్లో కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళ కలిగిస్తోంది.
