టిక్ టాక్’తో పరిచయం.. వేధింపులు.. బుల్లితెర నటి ఆత్మహత్య !

సినీ పరిశ్రమలో మరో విషాదం. బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. మధురానగర్ హెచ్ 56 బ్లాక్ సెకండ్ ఫ్లోర్‌లో మంగళవారం రాత్రి ఫ్యాన్ కి గురి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రావణి ఆత్మహత్యకు కారణం టిక్ టాక్ పరిచయమేనని.. ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.
శ్రావణి నటిగా ఎదిగే క్రమంలో ఉంది. మౌన రాగం, మనసుమమత సీరియల్స్ తో ప్రేక్షకులకి దగ్గరయింది. ఆమెకు కొన్నేళ్ల క్రితం కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి (సన్నీ)తో టిక్ టాక్‌లో పరిచయం ఏర్పడింది. దేవరాజు రెడ్డి కూడా నటుడు. భాగ్య రేఖ సీరియల్ లో నటిస్తున్నారు. శ్రావణి ద్వారానే ఆయన సీరియల్స్ లోకి వచ్చారట. కొన్నాళ్లు వీరి స్నేహం.. ప్రేమ బాగానే సాగింది. ఆ తర్వాతే దేవరాజు శ్రావణిని వేధించారని.. ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
శ్రావణి పడుకున్న టైమ్ లో ఆమె ఫ్రింగర్ పింట్ తో మొబైలో ఆన్ చేసి.. ఇతరకులకి కాల్ చేసేవారు. చాట్ చేసేవారని చెబుతున్నారు. ఆమె మెంటల్ గా వేధించాడు. అతడి గతంలో ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశామని చెప్పారు. అక్క చావుకి కారణం అయిన దేవరాజ్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరుడు శివ డిమాండ్ చేస్తున్నాడు.తన కూతురు శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్ కారణమణి శ్రావణి తల్లి పాపారత్నం ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
