తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం ఆలస్యమైన అంతే !

తెలంగాణ ఎంసెట్ ప్రారంభమైంది. 9గంటల లోపు పరీక్షల కేంద్రానికి చేరుకున్న విద్యార్థులకి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతిని ఇవ్వలేదు. దీంతో కొందరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విద్యార్థులకు టెంపరేచర్ చెక్ చేసి, చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్న తర్వాత లోపలకు పంపించారు.
రెండు సెషన్స్ గా పరీక్ష ఉంటుంది. సెకండ్ సెషన్‌లో ఈ మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభ మవుతుంది. తెలంగాణ, ఏపీలో కలిపి 102 (తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్‌లో 23) కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 1,43,165 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ జరగనుంది.
