తెలంగాణలో 2,479 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2,479 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,47,642 కి చేరింది. మృతుల సంఖ్య 916కి చేరింది.
కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,485 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,15,072కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
