బిగ్ బ్రేకింగ్ :  బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ అవుట్

గంగవ్వ అభిమానులకి బ్యాడ్ న్యూస్. బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ బయటికొచ్చారు. అలాగని ఆమె ఎలిమినేట్ కాలేదు. మరోసారి అనారోగ్యానికి గురైన గంగవ్వ తనని ఇంటికి పంపింమని బిగ్ బాస్ ని కోరింది. హోస్ట్ నాగార్జున కూడా గంగవ్వ ఆరోగ్యంపై వాకాబు చేశారు. ఆమెని కన్ష్ఫెన్ రూమ్ కి పిలిచి మాట్లాడారు. తన ఆరోగ్యం బాగులేదు ఇంటికి పంపించమని గంగవ్వ నాగ్ ని కోరింది. ఆయన కూడా ఒకే చెప్పేసి.. బిగ్ బాస్ అనుమతితో గంగవ్వని బయటికి పంపించారు. అయితే గంగవ్వని నాగ్ కి మంచి దీవనార్థి పెట్టింది. మీకు మనవడు పుట్టాలని కోరుకుంటున్నా. నేను హైదరాబాద్ వచ్చి మిమ్మిల్ని చూస్తానని గంగవ్వ అన్నారు. 

వాస్తవానికి రెండు వారాల ముందు గంగవ్వ తీవ్ర అనారోగ్యానికి గురైంది. తన పానం బాగలేదు. వెళ్లిపోతానని అవ్వ కోరింది. అయితే గంగవ్వకు చికిత్స అందించి ఒకట్రెండ్రోజులు రెస్ట్ ఇచ్చి.. మళ్లీ ఇంట్లోకి పంపించారు. ఆ తర్వత ఓ వారం గంగవ్వ హుశారుగానే కనిపించారు. కానీ ఈ వారం గంగవ్వ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో… అవ్వని ఇంటికి పంపించడమే బెటరని బిగ్ బాస్ నిర్ణయానికి వచ్చారు. అవ్వకి అనుమతినిచ్చారు.