ధాన్యం కొనుగోలుకు 5,690 కేంద్రాలు

కరోనా విజృంభిస్తున్న టైమ్ లో తెలంగాణ ప్రభుత్వం రైతులకి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. రైతు దగ్గరికి వెళ్లే ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ వానాకాలం పంటని కూడా అలాగే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మద్దతు ధరలని కూడా ప్రకటించారు. తాజాగా వానాకాలం పంట వరిధాన్యం సేకరణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వరిధాన్యం సేకరణ కోసం 5,690 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారా వరిధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. జీసీసీ, ఏఎంసీ కేంద్రాల ద్వారా పౌరసరఫరాల శాఖ, హాకా ద్వారా 9 జిల్లాల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు.  ఏ-గ్రేడ్‌ వరికి రూ. 1,888, సాధారణ రకం ధాన్యానికి రూ.1,868 కనీస మద్దతు ధరను కల్పించనున్నారు.  ధాన్యం సేకరణ, సంబంధిత అంశాల కోసం టోల్‌ ఫ్రీ నంబర్ 1800-425-00333, 1967ని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. వానాకాలంలో 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.