కరోనా బారినపడిన నటుడు ఆరోగ్యం అత్యంత విషమం !

సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు కరోనా బారినపడుతున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరు కరోనాపై పోరాటంలో ఓడిపోతున్నరు. ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. తాజాగా కరోనా బారినపడిన ప్రముఖ బెంగాలీ నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే విజేత సౌమిత్రా ఛటర్జీని(85) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారమ్.

శుక్రవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి క్షణం వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నట్లు కూడా చెప్పారు. ఈ నెల 6న సౌమిత్రా ఛటర్జీ కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇటీవల ఆయన ‘అభియాన్‌’ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయన కరోనా బారిన ఉంటారని కుటుంబ సభ్యులు అభిప్రాయ పడుతున్నారు. సౌమిత్రా ఛటర్జీ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.