ఉప్పెన హీరోయిన్’తో నాని రొమాన్స్

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రెండు పాటలే విడుదలయ్యాయ్. ఈ రెండు పాటలతోనే కృతిశెట్టి ఫేమస్ అయింది. ఆమెకు సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఏకంగా స్టార్ హీరోల సినిమాలకు ఆమె పేరుని పరిశీలిస్తున్నారు. తాజాగా నాని సినిమా కోసం కృతిశెట్టిని తీసుకున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్’తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత టాక్సీవాల దర్శకుడు సాంక్రిత్యయాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్ గా కృతిశెట్టిని తీసుకున్నట్టు సమాచారమ్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక కృతిశెట్టి తొలి చిత్రం ఉప్పెన రిలీజ్ కి రెడీగా ఉంది.
